Saturday, May 25, 2024

Exclusive Story – నిజామాబాద్ లో భారీ వర్షం -రైతుల్లో చిగురించిన ఆశలు

నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా వరుణదేవుడు కరుణించడంతో భారీ వర్షాలు కురిసాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంజీరా నదిలో పెద్ద ఎత్తున వచ్చి నీరు చేరడంతో మంజీరా పర్వాళ్లు తొక్కుతుంది. వర్షాలు పెద్ద ఎత్తున పడటంతో ప్రస్తుతం సాగుచేసిన పంటలకు రైతులకు దిగులు లేకుండా పోయింది. రాబోయే వేసవిలోనూ రభి పంటల సాగుకు కాలం అనుకూలిస్తుంది అన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు నిరాశ గురైన రైతులు గత వారం రోజులుగా వస్తున్న వర్షాల తో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు సాగుచేసిన వారి పంట ఏపుగా పెరిగి చూపర్లను ఆకట్టుకుంటుంది. వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా కనీస వర్షపాతం లేకపోవడంతో రైతాంగం కొంతవరకు ఆందోళన కు గురైంది.

నిజాంబాద్ జిల్లాకు వరప్రదాయైనటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టులో ఐదు టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతన్న లకు నెల రోజుల క్రితమే కాలువల ద్వారా ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా బోరు బావులు ఉన్నాయి. ప్రతి ఏడాది నిజాంసాగర్ లో నీరు ఉన్నా లేకపోయినా వర్షాకాలంలో పడే వర్షం పై ఆధారపడుతూ ఉన్న బోరుబావులతో పెద్ద ఎత్తున పరిపంట సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు అధిగమిస్తూ ముందస్తుగా వరి పంటను సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యపరిచారు. నిజాంబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే వరి పంట సాగులో మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించింది. జిల్లాలోని బోధన్ బాన్సువాడ నియోజకవర్గం రైతాంగం ప్రతి ఏడాది వరి పంటను ముందస్తుగానే సాగు చేస్తూ ఉంటారు. ముందస్తుగా సాగు చేయడంతో పాటు అత్యధిక దిగుబడులను రాబట్టుకోవడంలో రైతులు దిట్టగా చెప్పుకోవచ్చు. బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న వ్యక్తిగా కాకుండా మహోన్నత శక్తిగా చెప్పుకోవచ్చు.

35 ఏళ్లుగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకే కాకుండా జిల్లా రైతాంగనికి బాసటగా నిలుస్తూ గత టిడిపి ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రులుగా తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కెసిఆర్ సారథ్యంలోని ప్రభుత్వంలో సైతం వ్యవసాయ మంత్రిగా పనిచేసి లక్ష్మి పుత్రుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు .ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సభాపతిగా కొనసాగుతూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. గతంలో ప్రాజెక్టులో నీరున్న కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయాలంటే ఎంతో కాలం వృధా అయ్యేది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. జూన్ మాసంలో ఏమాత్రం వర్షం పడకపోవడంతో రైతులు కొంతవరకు నిరాశకు గురయ్యారు. ముందస్తుగా సాగు చేసుకుందామని వరి నారుమళ్లను మేమాసంలోనే సిద్ధం చేసుకున్నారు.

నిజాం సాగర్ నీటి విడుదల

- Advertisement -

నిజాంసాగర్ రైతంగం కొన్నేళ్లుగా పంటల సాగులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు వస్తున్నారు. పలుమార్లు పంటల సాగు చేసి చేతికి వచ్చే దశలో ఎండిపోవడం తీవ్ర నష్టాలను రైతులు చవిచూశారు. జిల్లా రైతాంగం పంటల సాగులో తెలివిగా వ్యవహరిస్తూ వాతావరణానికి అనుకూలంగా పంటను సాగు చేపట్టడం వంటి మెలకువలను పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఏడాది నిజాం సాగర్లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉన్నప్పటికీ జిల్లా రైతాంగాన్ని ముందస్తుగా పంటలు సాగు చేయాలని చైతన్యవంతులు చేసిన సభాపతి పోచారం సాగునీటిపై దృష్టి పెట్టారు. జూన్ మాసంలో సాగునీరు అందించి తీరుతామని రైతులకు భరోసా ఇచ్చారు. నిజాంసాగర్ రైతాంగ పరిస్థితులను వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిజాంసాగర్ లో ఉన్న కొద్దిపాటి నీటిని విడుదల చేసేందుకు ఉత్తర్వులు విడుదల చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుండి సాగునీటికి జూన్ మాసంలో నీటి విడుదల కానప్పటికీ నిజాంసాగర్ నీటిని జూన్ మాసంలో పంటల సాగుకు కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. జిల్లాలోని రైతాంగం ముందస్తుగా పంటల సాగు కు ఏర్పాట్లు చేసుకోవడంతో సాగర్ నీరు విడుదల అయిన వెంటనే వరి నాట్లు ప్రారంభించి ఇప్పటికే 80% వరి పంటను నాటుకున్నారు. గతంలో విద్యుత్ సరఫరా లో ఎన్నో అవాంతరాలు కష్టాలు చూసిన రైతాంగం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాల నుండి గట్టెక్కారు. బాన్సువాడ నియోజకవర్గం లో బోర్లు అత్యధికంగా ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు కొరత లేకుండా రాబోయే 20 ఏళ్ల వరకు సరిపడే విద్యుత్ ఏర్పాట్లను చేయడం ఎంతో అభినందనీయం.

వర్షాదారిత పంటల సాగు

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో కొంత ప్రాంతం ఆర్మూర్లో మరియు బాల్కొండ నియోజకవర్గము పరిధిలోని పలు ప్రాంతాల్లో పసుపు, మొక్కజొన్న, సోయా, పత్తి ,మిర్చి లాంటి పంటలను సాగు చేస్తుంటారు. జూలై మాసంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి వర్షా ఆధారిత పంటలను సాగు చేశారు. జూన్ మాసంలో సాగు చేయాల్సిన పంట సాగు జూలైలో ఆలస్యంగా సాగు చేసినప్పటికీ ప్రస్తుతం పంటల ఎదుగుదల ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఆ జిల్లాకు సాగునీరు సరఫరా కాదు. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున వర్షాదారిత పంటలను సాగు చేస్తారు. పంటల సాగు కొంతవరకు ఆలస్యమైనప్పటికీ ఈ ప్రాంతంలో సాగు చేసిన సోయా పత్తి తదితర పంటలకు ప్రస్తుతం వాతావరణం అనుకూలించినట్లు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో అతి తక్కువ విస్తీర్ణంలో వరి పంటను సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగుచేశారు. గతంలో పూర్తిగా వర్షంపై ఆధారపడి పంటలను సాగు చేసేవారు ప్రస్తుతం వర్షాదారిత పంటలను సైతం బోరు బావులను అనుసంధానం చేసుకొని రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో కాలం కలసి రాకపోతే చేతికి వచ్చిన పంటలు ఎండిపోయేవి. ప్రస్తుతం పగటి విద్యుత్ సరఫరా కావడం సాగుచేసిన పంటలకు బోరుబావుల ద్వారా నీటిని అందించి పంటలను పండిస్తామన్న దిమాలో రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement