Thursday, June 13, 2024

Gangs Of Godavari | విశ్వక్ సేన్ మాస్ అవ‌తారం.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల మే 31న థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

“లంకల రత్న” అనే రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌‌లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ అంతటా యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బావుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement