Saturday, June 22, 2024

Accident | కాశ్మీర్‌లో టూరిస్ట్ వ్యాన్ బోల్తా.. నలుగురు మృతి

కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో… ఓ టూరిస్ట్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబీలు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన సమయంలో వాహనంలో ఏడుగురు పర్యాటకులు ఉన్నారని.. వారంతా పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మరోవైపు.. గాయపడిన వారిని అనంత్‌నాగ్‌లోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో నలుగురు చనిపోయారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మృతులను సందీప్ శర్మ (28), రోమి (26), జగదీష్ అలియాస్ హనీ(23), గుర్మీత్ సింగ్ (23)గా గుర్తించారు. గాయపడిన వారిలో హర్‌చంద్ సింగ్ (34), కరణ్‌పాల్ (25), అషు(18)లు ఉన్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement