Friday, May 31, 2024

Aditi Rao : కేన్స్ లో గ‌జ‌గామిని….

భ‌న్సాలీ ‘హీరామండి’లో వేశ్య పాత్ర‌లో అద్భుత‌మైన అభిన‌యంతో క‌ట్టి ప‌డేసిన అదితీరావ్ హైద‌రీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో సంద‌డి చేసింది అదితీలోని సమ్మోహనకరమైన ‘గజగామిని నడక’ను తెర‌పైకి తేవ‌డంలో భ‌న్సాలీ విజ‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ ప్ర‌దర్శన వైరల్ అయ్యింది.

- Advertisement -

ఇప్పుడు అదితీ కేన్స్ ఉత్స‌వాలు జ‌రుగుతున్న‌ ఫ్రెంచ్ రివేరాలో తన నడకను పునఃసృష్టించింది. అదితి రావ్ హైదరి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ‘సైయాన్ హతో జావో’ (హీరామండి) పాటలోని తన వైరల్ ‘గజగామిని నడక’ని రీక్రియేట్ చేస్తూ కనిపించింది.

హైదరీ త‌న అనుచ‌ర బృందంతో కలిసి హొయ‌లొలికిస్తూ ఈ అంద‌మైన‌ నడకను ప్రదర్శించింది. గౌరీ- నైనికా నుండి అద్భుతమైన బ్లాక్ అండ్ ఎల్లో ఫ్లోర‌ల్ దుస్తులు ధరించింది. అదితీ తన పోస్ట్‌లో వాకింగ్ ఇన్ కేన్స్ లైక్ అని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో త‌న‌దైన సొగ‌సును హైలైట్ చేసిన ఈ వీడియో వేగంగా అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement