Saturday, October 5, 2024

Mehreen : రూటు మార్చిన మెహ్రీన్…..

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్. కెరీర్‌ ఆరంభంలోనే ఈ అమ్మడు జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ పేరు దక్కించుకుంది. మొదటి సినిమాతో నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంది.

- Advertisement -

తెలుగు తో పాటు హిందీ మరియు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ లో ఒకానొక సమయంలో బిజీ బిజీగా గడిపింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

ముఖ్యంగా తెలుగు లో ఈ అమ్మడిని ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోక పోవడంతో కెరీర్ ఖతం అయినట్లే అన్నట్లు ప్రచారం జరుగుతోంది.థాయ్‌ లో అంజమ్మ పెళ్లి ఏర్పాట్లు..! మెహ్రీన్‌ ఇక కనిపించదు అనుకుంటున్న ప్రతి సారి ఏదో ఒక సినిమాతో సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ముద్దుగుమ్మకి ఆఫర్లు వచ్చినా హిట్ అవ్వడం లేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం హిట్‌ బొమ్మలను షేర్‌ చేస్తుంది. రెగ్యులర్ గా ఇన్‌ స్టా ద్వారా మెహ్రీన్ షేర్‌ చేస్తున్న అందాల ఆరబోత ఫోటో షూట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇంత అందంగా ఉన్న మెహ్రీన్‌ ను ఫిల్మ్‌ మేకర్స్‌ పట్టించుకోక పోవడం ఏంటి అన్నట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా సముద్రపు అందాలను తలదన్నేలా బ్లాక్ డ్రెస్ లో జల కన్య మాదిరిగా కనిపిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంది.

బ్యూటీఫుల్‌ స్కిన్‌ టోన్‌ తో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముందు ముందు ఇంతటి అందం కు వరుసగా ఆఫర్లు రావాలని ఆశిస్తున్నాం అంటూ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement