Monday, June 10, 2024

TG | షాహిన్ హాస్పిటల్‌లో అవకతవకలు.. వైద్య సేవలు బంద్

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభా న్యూస్) : నిజామాబాద్‌ నగరంలోని ఖిల్లా రోడ్డులోని షాహీన్‌ ఆస్పత్రికి షోకాజ్‌ నోటీసులు అందజేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్‌ తెలిపారు. కొద్దిరోజుల క్రితం షాహీన్ ఆస్పత్రిలో మహిళకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ మహిళ గర్భాన్ని తొలగించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై డీఎంహెచ్ ఓకు ఫిర్యాదు అందడంతో… వెంటనే జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ ఓ ఆదేశాల మేరకు షాహిన్ ఆస్పత్రిలో మహిళకు అందించిన చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను డీఎంహెచ్‌ఓ, జిల్లా కలెక్టర్‌కు అధికారులు అందజేశారు.

విచారణలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌నిట్లు తేలడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ శనివారం షాహిన్‌ ఆస్పత్రికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆస్పత్రిలో వైద్య సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు షాహీన్‌ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించరాదని డీఎంహెచ్‌వో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement