Saturday, June 15, 2024

Chandrika Ravi : సిల్క్ స్మిత బ‌యోపిక్ లో చంద్రిక

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఇండియన్ బ్యూటీ చంద్రిక రవి అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ లో ఐటెం బ్యూటీగా నటించిన భామ అంటే వెంటనే గుర్తుపడతారు. ఈ అమ్మడు మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమిళంలో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో నటిగా అడుగుపెట్టింది.

తరువాత సెయి మూవీలో నటించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఘోస్ట్ క్యారెక్టర్ లో చంద్రిక రవి ఈ చిత్రంలో కనిపించింది. వీరసింహారెడ్డి సినిమాలో ఐటెం సాంగ్ తో అందరికి చేరువ అయ్యింది. అలాగే బాలీవుడ్ టూ హాలీవుడ్ అనే ఇంగ్లీష్ చిత్రంలో చంద్రిక రవి నటించింది. మ‌రో చిత్రంలో అంద‌గాడు అలాగేనా? ప్రస్తుతం అమ్మడు సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement