Saturday, July 27, 2024

అన్నా బాహు సాటే ఆశయ సాధనకు కృషి చేద్దాం: జడ్పీ చైర్మన్

ఉట్నూర్ జులై 18(ప్రభన్యూస్) సాహిత్య సామ్రాట్ అన్నా బాహు సాటే ఆశయ సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెడుమ బోజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో అన్నా బహు సాటే 54వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు అన్న బహుసాటే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సాహిరి అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానీయుడని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో దళితులు ముందుకు సాగాలని వారన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement