Friday, June 14, 2024

Breaking | స్క్రాప్ గోధాంలో చెలరేగిన మంటలు..

గుమ్మడిదల, ప్రభ న్యూస్ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ఎదురుగా ఏర్పాటు చేసిన స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. గోడౌన్ లో కెమికల్ డ్రమ్ముల నిల్వలు కార‌ణంగా దట్టమైన మంటలు ఎగిసిప‌డ‌టంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement