Tuesday, November 29, 2022

కొమురం భీం జిల్లాలో పెద్ద‌ పులి సంచారం క‌ల‌క‌లం.. 12 బృందాల‌తో గాలింపు..

కొమురం భీం జిల్లాలో పులుల సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. కాగజ్‌నగర్‌ మండలం వేంపల్లి – అనుకోడ గ్రామ శివారులో పెద్ద పులి సంచ‌రిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకున్న‌ట్లు పాద ముద్రలు ద్వారా క‌నిపెట్టారు. కెమెరాల ద్వారా అటవీశాఖ అధికారులు పులి కదలికలను గమనిస్తున్నారు. పులి కోసం 12 బృందాలచే గాలింపు చర్యలు చేపట్టారు. పులి కదలికలను పర్యవేక్షిస్తున్న జిల్లా అటవీశాఖ అధికారి దినేష్ కుమార్… పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement