Sunday, May 19, 2024

ADB : వడ దెబ్బతో ఉపాధి కూలీ మృతి

భీంపూర్, మే 7(ప్ర‌భ‌న్యూస్‌): వడ దెబ్బతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ మస్కాపూరి ఇస్తారి(35) మృతి చెందాడు. ఆర్లిటి గ్రామానికి చెందిన మస్కాపురి ఇస్తరి రోజు మాదిరిగానే ఉపాధి హామీ పథకంలో భాగంగా శ‌నివారం ఉపాధి పనికి వెళ్ళాడు. పనులు చేస్తున్న నేపథ్యంలో కాస్త చెక్కరగా ఉందని తోటి కూలీ కి చెప్పాడు ఎలాగోలా పని ముగించుకొని ఇంటికి వ‌చ్చాడు.

ఇంటికివ‌చ్చిన కాసేపటికి వాంతులు రావడంతో ఇంటి వద్ద ప్రథమ చికిత్స చేశారు. అయినా వాంతులు తగ్గక పోయే సరికి శనివారం రాత్రి సమయం లో 108 లో అదిలాబాద్ లోని రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement