Thursday, April 25, 2024

నేడు కాస్త తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం రేటు రూ.48 వేల 740 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం మాత్రం రూ.10 తగ్గి 53 వేల 170కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రూ.48, 890 వద్ద ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.53,340 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రేటు ఏ మాత్రం మారలేదు. గత 2 రోజుల్లో రూ.1500 మేర పతనమైనప్పటికీ ప్రస్తుతం రేట్లు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.67 వేల వద్ద ఉంది. దిల్లీ మార్కెట్లో మాత్రం వెండి ధరలు చాలా కనిష్టాల వద్ద ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం రూ.300 తగ్గి కిలోకు రూ.60 వేల 900 వద్ద ఉంది. ఇది ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అక్కడి పన్నులు, పరిస్థితులకు అనుగుణంగా రేట్లు వేర్వేరుగా ఉంటాయి. కొనేటప్పుడు చూసుకొని కొనుక్కుంటే మంచిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement