Sunday, April 28, 2024

సింగరేణికి కరోనా కాటు

కాసిపేట: కరోనా నేపద్యంలో గత ఏడాది ఏప్రిల్‌ 1 నుండి యాబై రోజులు లే ఆఫ్‌ అమలుచేసిన సింగరేణిని నష్టాలబారీనపడేశాయి. నాటి లే ఆఫ్‌ ప్రభావం, దాని పరిణామాలు నేటికి వెంటాడుతున్న క్రమంలోనే కాలం గడిచిపోయి మరల ఏప్రిల్‌ రానేవచ్చింది. ఆనాటి అనుభవాలను అధికారులు, కార్మికులు నెమరేసుకుంటున్నారు.
సింగరేణి కంపేనీలో 2020 ఏప్రిల్‌ 1 రెండవ షిప్టు నుండి యాజమాన్యం లే ఆఫ్‌ను ప్రకటించింది. అప్పటికే దేశం, రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగి పోతుండటం,నమోదవుతున్న మరణాలు సమాజాన్ని ఆందోళనలకు గురిచేస్తున్న సమయంలో ప్రభుత్వాలు పరిశ్రమలు, కంపేనీలలో లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలివ్వడం జరిగింది. సింగరేణి గనుల్లో కార్మికులు సామూహికంగా కలిసి పనిచేయాల్సిన పరిస్థితులుండడం, మరో వైపు కార్మిక సంఘాల నుండి ఆందోళనలు వెరసి లే ఆఫ్‌ ప్రకటించాల్సి వచ్చింది. సింగరేణిలో 27 అండర్‌గ్రౌండ్‌ గనులు, 18 ఉపరితల నుండి బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా కేవలం అండర్‌గ్రౌండ్‌ గనుల్లో మాత్రమే యాజమాన్యం లే ఆఫ్‌ ప్రకటించింది. దాంతో సుమారు 18 వేల మంది కార్మికులు దీని పరిదిలోకి వచ్చారు. మొదట 2020 ఏప్రిల్‌ 14 వరకే లే ఆఫ్‌ ప్రకటించిన యాజయాన్యం దానిని 50 రోజులు అంటే అదే ఏడాది మే 20 తేదీ వరకు కొనసాగించింది. ఈ లే ఆఫ్‌ కాలానికి ఈ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా కార్మికులకు మాత్రం కంపేనీ సగం వేతనం చేల్లించింది.

సాధించని వార్షిక ఉత్పత్తి లక్ష్యం : సింగరేణి యాజమాన్యం 2019-20కి 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే అప్పటికే కరోన పరిస్థితులు వుండడంతో ఆ ఏడాది చివరి రెండు, మూడు నెలలు ఉత్పత్తిపై ప్రభావం ఏర్పడడంతో నిర్ధేశించిన లక్ష్యం సాదించలేక పోయింది. 2020-21కి అనుకున్న లక్ష్యం సైతం సాధించలేక పోవడానికి పలు కారణాలను చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా 50 రోజుల పాటు అండర్‌గ్రౌండ్‌ గనుల్లో లే ఆప్‌ అమలు కారణం ఒకటైతే గత వానాకాలంలో కురిసిన అతి వర్షాలు, కార్మికుల గైరాజరు వెరసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. సుమారు 64 మిలియన్‌ టన్నుల బొగ్గును మాత్రమే అది ఉపరితల గనుల కీలకంగా మారడంతో అది సాద్యమైంది. మరో వైపు కరోనా కాలానికి అమలుచేసిన లే ఆఫ్‌లో కార్మికులకు సగం జీతం చెల్లించిన యాజమాన్యం గత ఏడాది అంటే లే ఆఫ్‌ అమలుకు మందు మార్చి నెలలో చేసిన డ్యూటీలకు చెల్లించాల్సిన వేతనాల్లో నుండి సగం వేతనాలు కోత విధించి చెల్లింపులు చేయడంతో కార్మికులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.
సింగరేణిలో 47 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండగా మార్చి నెల సగం జీతం కోత అంటే ప్రతి నెల కార్మికులకు నెల నెల సుమారు రూ.260 కోట్లు అనుకుంటే యాబై శాతం అంటే రూ.130 కోట్ల రూపాయలను మార్చి నెలకు కార్మికులకు ఆనాడు అందించింది.
40 కోట్ల రూపాయలు విరాళం : దేశంలో విపత్తులు ఊర్పడిన సమయంలో కొంత సహాయం చేసి ఆదుకునే సింగరేణి, సంస్థలో పని చేసే ఉద్యోగులు కరోనా సమయంలో ముందు నిలిచారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ వలన ప్రజలు పడుతున్న బాదలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా సింగరేణి సంస్థ రూ.40 కోట్లు విరాళం అందించింది. కార్మికులు సైతం ఒక రోజు వేతనం రూ.8.5 కోట్లు కరోనా నియంత్రణ కింద ముఖ్యమంత్రి సహాయం నిధికి సామాజిక భాద్యతగా విరాలం ఇవ్వడం జరిగింది.

నేటికి వెంటాడుతున్న కరోనా : గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్‌ 19 వ్యాది విస్తృతం కాగా కంపేనీ లే ఆఫ్‌ ప్రకటించడం, కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్న దాని జాడలు నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. మరల సెకండ్‌ వేవ్‌ మరీ తీవ్రమైందిగా చెపుతున్నారు. అయితే గత ఏడాది అనుకున్న వార్షిక ఉత్పత్తిని సాధించలేక పోయిన ఈ సంవత్సరం అంటే 2020-21 వార్షిక ఉత్పత్తినైన సాధిద్దామనుకున్న యాజమాన్యం అంచనాలు నెరవేరలేక పోయాయి. ఈ ఏడాదికి మొదట 70 మిలియన్‌ టన్నుల బొగ్గు లక్షంగా పెట్టుకున్న పరిస్థితుల కారణంగా67 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్షంగా నిర్ణయించిన కరోన కారణంగా అది కూడ సాధ్యం కాలేక పోవడంతో యాజమాన్యం అసంతృప్తికి గురయింది. ఏమైనా సిరులమాగాణి సింగరేని ఇలాంటి విపత్తులు ఎన్నింటినో ఎదుర్కొంటున్నది. వాటిని పాఠాలుగా చేసుకుని భవష్యత్‌ ప్రణాలికలతో ముందుకు పోతున్నది. సంస్థ సాధిస్తున్న లాభాల్లో నుండి వాటా శాతాన్ని కార్మికులకు అందిస్తూ, కరోనపై విజయం సాదించే దిశలో పయనిస్తూ కార్మికులకు అండగా యాజమాన్యం నిలుస్తున్నది. కరోన బారిన పడని పరిశ్రమ లేదు. అందుకు సింగరేని మినహయింపు ఏమి కాదు కాని ఆ అనుభవాలను అనుకూలంగా మలుచుకుని పడిలేచిన కెరటంలా లాబాలబాటలో పయనిస్తుందని, బొగ్గు ఉత్పత్తి లక్షాలను దాటేందుకు కార్మికుల అండతో ముందుకు పయనిస్తుందనే ఆశభావంతో కార్మికులు, అధికారులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement