Monday, April 29, 2024

ఒకే గ్రామంలో 29 మందికి కరోనా

తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలోని యేడపల్లి గ్రామంలో 29 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. గ్రామంలో సుమారు 180 కుటుంబాలు ఉన్నాయి, వీరిలో 190 మందిని కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డిఎంహెచ్‌ఓ) సుధర్ సింగ్ తెలిపారు.

మహారాష్ట్రలోని ఓ గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమానికి కొంతమంది గ్రామస్తులు హాజరైన తరువాత గ్రామంలో కరోనా కేసులు నమోదయ్యాయని అధికారి తెలిపారు. మహాదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన తర్వాత పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా, గ్రామంలోని రహదారులను మూసివేశారు. గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 మందికి టెస్టులు నిర్వహించగా 887 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో నలుగురు కరోనా వల్ల చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement