Saturday, April 27, 2024

కార్మికులకు ప్రమోషన్‌ ఆర్డర్‌ కాపీలు..

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిలో ప్రమోషన్‌ పొందిన కార్మికులకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ ఆర్డర్‌ కాపీలను అందచేశారు. గనిపై ఏర్పాటు చేసిన ఎక కార్యక్రమంలో పాల్గొన్నారు. గనిలో 116 మంది బదిలీ వర్కర్‌ కార్మికులు జనరల్‌ మజ్దూర్‌లుగా ప్రమోషన్‌ పొందిన కార్మికులు, గనిలో పని నైపుణ్యత కలిగి, బొగ్గు ఉత్పత్తికి పాటుపడుతున్న కార్మికులకు ప్రోత్సాహక నగదు బహుమతులను సైతం అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గత ఏడాది గనికి నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తిలో కేవలం 47 శాతం మాత్రమే సాధించి నష్టాల్లో వుందని , ఈ 2021-22కు గనికి 2.40 వార్షిక బొగ్గు ఉత్పత్తి టార్గట్‌ సాధించాలని, గనిలో అన్ని మెరుగైనా సౌకర్యాలు, పని స్థలాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా గనిలో గైరాజర్‌ శాతం ఎక్కువగా వుందని, విధులకు బాధ్యతగా హాజరవుతూ బొగ్గు ఉత్పత్తి లక్షాలను సాధించేందుకు పోటీతత్వంతో పని చేయాలని సూచించారు. గనికి వచ్చే రోడ్డకు మరమ్మత్తులు చేపట్టాలని, కార్మికులకు మెరుగైనా మౌలిక సౌకర్యాలు కల్పించాలని గుర్తింపు సంఘం ఫిట్‌ కార్యధర్శి దుగుట శ్రీనివాస్‌ జియం దృష్టికి తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో కాసిపేట గ్రూప్‌ ఏజెంట్‌ రాజేందర్‌, గని మెనేజర్‌ భూ శంకరయ్య, డివై మెనేజర్‌ అల్లావుద్దిన్‌, గుర్తింపు సంఘం నాయకుడు మేడ సమ్మయ్య, ఏఐటీయూసీ నాయకులు వెంకటస్వామి, దాగం మల్లేష్‌, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement