Friday, April 26, 2024

జలజల జలపాతం పాట మేకింగ్ మీరు చూడండి..

బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన నుంచి మరో మేకింగ్ వీడియో విడుదలయింది. సినిమాలో ప్రేమికులను ఆకట్టుకున్న జలజలపాతం సాగ్ మేకింగ్ వీడియోను డైరెక్టర్ బుచ్చిబాబు విడుదల చేశారు. ఆ పాటను ఎలా చిత్రీకరించారనే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకింగ్ వీడియోను వదిలారు. ముఖ్యంగా వైష్ణవ్-కృతి మధ్యలో వచ్చే రొమాన్స్ సీన్స్ చిత్రీకరణ టైమ్ లో తీసిన ఈ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. సముద్రంలో ఉండే వాతావరణాన్ని సెట్ లో క్రియేట్ చేసిన విధానం చూపరులకు అద్భుతంగా అనిపిస్తోంది. సముద్రం మధ్యలో పడవ .. పడవలో ప్రేమికులు .. వెన్నెల రాత్రి … ఎవరూ లేని ఏకాంతం .. పడవ తప్ప పట్టించుకునేవారు లేని ప్రదేశం .. చుట్టూ కేరింతలు కొట్టే కెరటాలు .. ఈ నేపథ్యంలో సాగిన ఈ పాట కుర్రాళ్ల మనసులను కుదిపేసింది. ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీసు బద్దకాన్ని వదిలించేశాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement