Thursday, May 2, 2024

SRH vs RCB | విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. సన్‌రైజర్స్‌పై విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు సొంత గడ్డపై చేతులెత్తేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు విజృంభించడొతో.. 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. దీంతో ఎస్‌ఆర్‌‌హెచ్‌పై.. ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పవర్‌ప్లేకు ముందే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (1), అభిషేక్ శర్మ (31), మార్క్రమ్ (7), హెన్రిచ్ క్లాసెన్ (7) నిరాశపరిచారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (31), షాబాజ్ అహ్మద్ 40 నాటౌట్‌గా పరువాలేదనిపించగా.. మిగిలవారెవరూ 20 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు. ఇక, ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరాన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యష్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement