Friday, May 17, 2024

Election Effect – కొవిడ్ స‌ర్టిఫికెట్ల‌పై మోదీ బొమ్మ తొల‌గింపు

న్యూఢిల్లీ: కోవిడ్‌19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ స‌ర్టిఫికేట్‌లో ఉండే ప్ర‌ధాని మోదీ ఫోటోను ఆ స‌ర్టిఫికేట్ నుంచి తొల‌గించారు. భార‌త్‌లో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ స‌ర్టిఫికేట్‌లో మోదీ ఫోటోను తొల‌గించిన‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీఐ ఇచ్చిన ఆదేశాల మేర‌కు కోవిన్ స‌ర్టిఫికేట్ నుంచి మోదీ ఫోటోను తొల‌గించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

కొవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్ ..
ఇది ఇలా ఉంటే కొవిషీల్డ్ తీసుకున్న త‌ర్వాత చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవ‌ల అంగీక‌రించింది. కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ట్లు పేర్కొంది. బ్రిట‌న్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్‌జెవేరియా పేరుతో టీకాను స‌ర‌ఫ‌రా చేస్తున్నది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో అందించారు. ఇండియాలో ఆ టీకాను సీరం సంస్థ త‌యారు చేసిన స‌రాఫ‌రా చేస్తున్న‌ది… సైడ్ ఎఫెక్ట్ వార్త‌ల‌లో ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి..

- Advertisement -

10ల‌క్ష‌ల మందిలో ఏడుగురికే ఎఫెక్ట్..

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటన ఆ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో భయాందోళనలు రేపుతున్నది.అయితే ప్రజల అనుమానాలను వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకొన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, అంటువ్యాధులు నిపుణుడు డాక్టర్‌ రమాన్‌ గంగాఖేడ్కర్‌ స్పష్టం చేశారు. ప్రతి 10 లక్షల మందికి 7-8 మందిలో మాత్రమే రక్తం గడ్డకట్టే రిస్క్‌ ఉంటుందని, అది కూడా మొదటి డోసు తీసుకొన్న సమయంలోనే ఉంటుందని పేర్కొన్నారు. తర్వాతి డోసుల సమయానికి ఆ రిస్క్‌ పూర్తిగా తగ్గుతుందని, ఏమైనా దుష్ప్రభావాలు చూపిస్తే, అది మొదటి 2-3 నెలల్లోనే జరుగుతుందని చెప్పారు. దీని గురించి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement