Monday, April 29, 2024

HYD: 10భారతీయ భాషల్లో ఇండస్‌ యాప్‌స్టోర్‌ వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌

హైదరాబాద్‌: భారతదేశంలోనే పుట్టి విస్తరిస్తున్న స్వదేశీ యాప్‌ మార్కెట్‌ప్లేస్‌ అయిన ఫోన్‌పేకు చెందిన ఇండస్‌ యాప్‌స్టోర్‌ ఆంగ్లంతో పాటు 10భారతీయ భాషల్లో వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ వినూత్న ఫీచర్‌ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను రూపాంతరం చేసి, యూజర్లు తమకు నచ్చిన భాషలో వాయిస్‌ సెర్చ్‌ చేసి యాప్‌లను వెతికేందుకు వీలు కల్పిస్తుంది. వాయిస్‌ సెర్చ్‌ టెక్నాలజీ అనేది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ల సహకారంతో పని చేస్తుంది. భారతదేశంలోని ఇంటర్నెట్‌ యూజర్‌ బేస్‌లో దాదాపు 75శాతం మంది తమ మాతృభాషలోనే మాట్లాడుతారు.

ఈ ఫీచర్‌ లాంచ్‌ గురించి ఇండస్‌ యాప్‌స్టోర్‌ సహ వ్యవస్థాపకుడు, సీపీఓ ఆకాష్‌ డోంగ్రే మాట్లాడుతూ… కొత్త వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ అనేది అందరికీ అందుబాటులో ఉండి, అందరూ యాక్సెస్‌ చేసుకోగల యాప్‌ స్టోర్‌ను రూపొందించాలనే తమ ప్రయత్నంలో భాగమన్నారు. 82శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వాయిస్ యాక్టివేటెడ్‌ టెక్నాలజీని వాడుతున్నారన్నారు. కాబట్టి ఆరు నుండి అరవై సంవత్సరాల వయస్సు గల వారి కోసం భారతీయ భాషల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తే, ఇది బలమైన చోదకశక్తిగా మారనుంది. యూజర్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చే ఈ ఫీచర్‌, ఇండస్‌ యాప్‌స్టోర్‌ను మారుతున్న వాయిస్‌ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో నిలిపింది, ఇది ఈ దశాబ్దానికి చాలా అవసరమైన టెక్నాలజీ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement