Tuesday, May 14, 2024

AP: మల్కాపురం సీఐ సన్యాసి నాయుడు సస్పెండ్

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోయలాడ వేంకటేశ్వర జగదీష్ పట్ల సీఐ అనుచిత ప్రవర్తన
తనను చిత్రహింసలకు గురిచేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
ఆరోపణల నేపథ్యంలో సీఐపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు
విశాఖ క్రైం, ప్రభ న్యూస్ : స్వతంత్ర అభ్యర్థి విషయంలో సీఐ చేసిన అనుచిత ప్రవర్తన, తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేశారు. మల్కాపురం సీఐ ఎస్.సన్యాసి నాయుడును ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోయలాడ వేంకటేశ్వర జగదీష్ అనే రౌడీ షీటర్ పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించినట్టు అభియోగం వ‌చ్చింది. నామినేషన్ ను వెనక్కి తీసుకోవాలని చిత్ర హింసలు పెట్టినట్టు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందడంతో విచారణ అనంతరం సీఐను సస్పెండ్ చేయాలని స్థానిక అధికారులను ఎన్నికల కమిషన్ పరిశీలకులు ఆదేశించారు.

ఎంవీపీ, పద్మనాభం సీఐగా ఉన్న సమయంలో సదరు సీఐపై అనేక ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఉద్యోగి పై హత్యాయత్నం కేసు కాస్త కొట్లాట కేసుగా మార్చడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతాయి. అలాగే దళిత యువకుడికి థర్డ్ డిగ్రీ పేరుతో కాళ్ళు విరిచేసిన ఘటన విశాఖలో సంచలన రేపింది. చివరకు విశాఖ వెస్ట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోయలాడ వేంకటేశ్వర జగదీష్ అనే రౌడీ షీటర్ పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించినట్టు అభియోగం రావడంతో సీఐ పై వేటు వేయక తప్పలేదు. ప్రస్తుతం జరిగిన ఘటనపై విచారణకి ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement