Tuesday, July 23, 2024

MDK : మెదక్, జహీరాబాద్ లో గతం కంటే పెరిగిన ఓటింగ్ శాతం

ఉమ్మడి మెదక్ బ్యూరో, మే 14( ప్రభ న్యూస్): ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ లోకసభ ఎన్నిక కోసం సోమవారం జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. నిన్న సాయంత్రం కౌటింగ్ ముగిసే నాటికి( సాయంత్రం 5 గంటల వరకు) జహీరాబాద్ పోలింగ్ 71.91, మెదక్ పార్లమెంట్ ఓటింగ్ శాతం 73.63 కాగా మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన కౌంటింగ్ ఫలితాలు మెదక్ పార్లమెంటు ఓటింగ్ 74.38 నమోదు కాగా జహీరాబాద్ 74.54 ఓటింగ్ శాతం నమోదైంది.

- Advertisement -

గత ఎన్నికలతో పోల్చుకుంటే మెదక్ పార్లమెంటు పరిధిలో 2.63 శాతం, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో .46 శాతం నమోదైంది… గత ఎన్నికల కంటే ఈ సారి మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో స్వల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement