Tuesday, May 28, 2024

Special Train : ఇవాళ విశాఖ-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఇవాళ‌ ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ‌. విశాఖ నుంచి సాయంత్రం 4.15కి రైలు నెంబర్ 08589 స్టార్ట్ కానుంది. బుధవారం ఉదయం 6.15కి సికింద్రాబాద్ ఈ ట్రైన్ చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక రైలు నెంబర్ 08590 బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖకు చేరుకోనుంది.

- Advertisement -

ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో భారీగా హైదరాబాద్‌కు ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయి దర్శనమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement