Monday, April 29, 2024

SRH vs RCB | ఆదుకున్న కోహ్లీ, పాటిదార్.. హైదరాబాడ్ టార్గెట్ ఎంతంటే

ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ శుభారంభం అందించారు. అయితే దంచికొడుతున్న డుప్లెసిస్ (25)… నటరాజన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి మార్క్రమ్ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత వచ్చిన జాక్స్ 6 పరుగులకే వెనుదిరిగాడు.. దీంతో 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కోహ్లీ, పటీదార్ ఆదుకున్నారు. బౌండరీలతో చెలరేగిన పాటిదార్ ఈ సీజన్‌లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కోహ్లి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరమైన జోడీని ఉనద్కత్ విడదీసాడు. తర్వాత వచ్చిన కెమరూన్ గ్రీన్ భారీ షాట్లు (37 నాటౌట్) ఆడి మెరిశాడు. దినేష్ కార్తీక్ (6 బంతుల్లో 11), స్వప్నిల్ సింగ్ 6 బంతుల్లో 12 పరుగులతో పరువాలేదనిపించారు. కాగా, 207 పరుగుల టార్గెట్‌తో ఎస్‌ఆర్‌‌హెచ్‌ ఛేజింగ్‌కు దిగునంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement