Friday, May 3, 2024

ADB : నామినేష‌న్ వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి గొడం నగేష్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్ః ఆదిలాబాద్ లోకసభ స్థానానికి బిజెపి అభ్యర్థి గొడం నగేష్ బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ముధోల్, ఉట్నూర్ ఖానాపూర్, బోత్ ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి భారీ సంఖ్యలో బిజెపి నేతలు కార్యకర్తలు తరలివచ్చి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.

- Advertisement -

రామ్ లీలా మైదానం నుండి కలెక్టరేట్ వరకు నామినేషన్ మహోత్సవ ర్యాలీ అట్టహాసంగా సాగింది. దారి పొడుగునా బిజెపి జెండాలు చేతపట్టుకుని జైశ్రీరామ్, జై బిజెపి నినాదాలు మార్మోగాయి. బిజెపి అభ్యర్థి నగేష్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కి సమర్పించారు. నగేష్ వెంట జిల్లాకు చెందిన శాసనసభ్యులు పాయల్ శంకర్, బిజెపి ఎల్పీ నేత ఏ మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు రామారావు పటేల్, హరీష్ బాబు, పార్లమెంటరీ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, చిట్యాల సుహాసిని, ధోని జ్యోతి,ముస్తాపురే అశోక్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పథకాలు బిజెపి గెలుపుకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement