Monday, May 20, 2024

శిథిలావస్థలో బస్టాండ్..

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని కోల్‌బెల్ట్‌లో కీలక ప్రాంతమైన మందమర్రి బస్టాండ్‌ను ఆది నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్‌ ఆలనా, పాలన కరువై శిథిలావస్థకు చేరుకొని ప్రయాణ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. గతంలో సింగరేణి బొగ్గు గనులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతూ ఉండేది. నాడు మందమర్రి బస్టాండ్‌ నుండి శ్రీరాంపూర్‌, గోదావరిఖని, బీజోన్‌, బెల్లంపల్లి, గోలేటి తదితర గనులకు సింగరేణి కార్మికులు విధులు నిర్వహిస్తుండటంతో పాటు వారి కుటుంబసభ్యులు బెల్లంపల్లి, రామకృష్ణాపూర్‌, సింగరేణి ఏరియాసుపత్రికి వస్తుండటంతో ఈ ప్రాంతం కిటకిటలాడుతూ ఉండేది. కానీ గనుల మూసివేతతో సింగరేణి కార్మికులు తగ్గుముఖం పట్టడంతో బస్టాండ్‌పై సైతం నీలినీడలు అలుముకున్నాయి. ఈ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వవిప్‌గా పదవులు పొందినప్పటికీ బస్టాండ్‌ అభివృద్ధిని మరిచారని మందమర్రి ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కోల్‌బెల్టు ప్రాంతంలో కీలకంగా ఉన్న మందమర్రిని బస్టాండ్‌ను అభివృద్ధి చేసి ఇక్కడి నుండి కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు బస్సులను నడిపించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement