Tuesday, May 7, 2024

వికలాంగులకు ఐడి కార్డులు..

కోటపల్లి : కోటపల్లి మండలం ఏదుల్లబందం గ్రామపంచాయితీలో ఎంపీటీసీ జేక శేఖర్‌, అంగన్‌వాడీ టీచర్‌ నాగుల మణిమాలతో కలిసి వికలాంగులకు ఐడికార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌ కొటారి నిర్మల అధ్యక్షతన కార్యదర్శి గోమాస సమ్మయ్య గ్రామ సభను నిర్వహించారు. తదనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌ కింద పిల్లలు డీహైడ్రేషన్‌ బారీన పడకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పెండారి పోసక్క, వార్డు సభ్యులు కొండగొర్ల రంగు, తగరం శ్రీనివాస్‌, సల్పల సంతు, గంట చిన్నక్క, దుర్గం జయ, ఆశా వర్కర్‌ కొటారి సువర్ణ, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement