Sunday, May 19, 2024

TS : ఓటర్ లిస్ట్ లో ఎన్ని తప్పులో..!

వికారాబాద్ టౌన్, మే 7(ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం లోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 159 మున్సిపల్ వార్డు నెంబర్ 17 ఓటర్ క్రమసంఖ్య లోమొత్తం ఓటర్స్ 1152 అందులో 130 మంది ఓటర్ లకు పోలింగ్ స్లిప్ లు కుడా పంచలేని పరిస్థితి నెలకొన్నది. కొందరివి ఇంటి అడ్రస్ కుడా సరిగ్గా లేకపోవడం గమనార్హం.

- Advertisement -

కొందరివి ఇతర బూత్ లో ఉండగా మరికొందరికి డబుల్ 18 మంది ఓటర్ స్లిప్లు వచ్చాయి. ముగ్గురివి డబుల్ కారంగా తొలగించబడ్డారు. ఇటీవల ఇద్దరు మృతి చెందిన్నారు కానీ వారివి తొలగించబడలేవు. నలుగురిని ఇతర బూత్ లోకి మార్చారు. ఇలాంటి ఓటర్ లిస్టులతో పోలింగ్ జరిగితే ఎంతవరకు కరెక్ట్ అని ఓటర్స్ లిస్ట్ తయారు చేసిన అధికారుల పై మండి పడుతున్నారు ఓటర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement