Saturday, May 18, 2024

నూతన బోర్‌ పంపు పనులు..

కోటపల్లి: కోటపల్లి మండలంలోని జనగామ గ్రామపంచాయితీలో ఎస్సీ కాలనీవాసులు నూతన బోరుపంపును వేయాలని సర్పంచ్‌ జక్కు లక్ష్మణ్‌గౌడ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన బోరుపంపు పనులను ప్రారంభించారు. అడుగగానే నూతన బోరుపంపు ఏర్పాటు కోసం కృషి చేసిన సర్పంచ్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యులు గరీబ్‌ఖాన్‌, ఉప సర్పంచ్‌ శంకర్‌, గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు గట్టు సందీప్‌గౌడ్‌, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement