Tuesday, July 23, 2024

విశ్వ వైభవం…కన్యక జననం!

దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడమే జగజ్జనని కన్య క అవతారం. బ్ర#హ్మ, విష్ణు, మహశ్వర, త్రైమూర్త్య దే వతలకు మూలకారణమైన భువనేశ్వరీదేవిని ”కన్యక పరమేశ్వరి” రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది. గోదావరి తీరాన గల 714 గోత్రీకులకు నిల యాలైన 18 పట్టణాలకు కేంద్రంగా, పెనుగొండ ముఖ్య పట్ట ణంగా, మహా సంపదలతో, వైశ్యులలో తలమానికమైన కుసు మశ్రేష్టి, కుసుంబా దేవి దంపతులకు, అనేక జన్మల ఆర్జితాలైన పుణ్యాలకు తోడు, పుత్రకామేష్టి యాగ ఫలం ఏకమై, జగజ్జనని పరమేశ్వరిదేవి వైశాఖ శుక్లపక్ష దశమి నాడు అవతరించింది. అంతకు కొన్ని నిముషాల ముందే ఒక బాలుడు జన్మించాడు. పరమేశ్వరుని పూజా ఫలమైన కుమారునికి, విరూపాక్షుడు అని ”జగజ్జనని” అవతారమైనందున ”పరమేశ్వరి” అని నామకర ణాలు చేశారు. దేవి సర్వప్రాణులలో శక్తి రూపంతో వస్తున్నం దున ”వాసవి” అని, పర పురుషుల వైపు చూడక పరమేశ్వరుని యందే మనసు లగ్నం చేసినందున ”కన్యక” అని, నామాంకిత అయినది. ఇరువురును, కులగురువు భాస్కరాచార్యుని వద్ద వేదోక్త సంస్కారాలు, వేదాంగాలు నేర్చుకోగా, పరమేశ్వరి పం డితుల చెంత, సంగీత, నాట్య, సకల కళలలో, అసమాన ప్రతి భురాలై, విదుషీమణి అయినది. యుక్త వయస్కుడైన విరూపా క్షునకు సంపన్న కుబేరుడైన అరిధి శ్రేష్ఠి కూతురు రత్నావళితో, వివాహం జరిపించారు. పరమేశ్వరి యవ్వనవతియై, విశ్వమ యుడైన, మృత్యుంజయుడి యందే, మనసు లగ్నం చేసి నిరం తరం ధ్యానం చేస్తుండేది. ఇలా ఉండగా రాజ మహంద్ర వరా న్ని పాలించే, దుష్టుడైన విష్ణువర్ధనుడు పక్క రాజ్యాలను జ యించి, తిరిగి వెళుతూ, పెనుకొండ వద్ద ఉద్యానవనంలో బస చేయగా, కుసుమశ్రేష్టి తమ ప్రభువును దర్శింప కట్నకాను కలు,దాసదాసీ జనంతో వెళ్ళాడు. రాజును చూడడానికి, మహ శ్వరి… తన తల్లి కుసుంబాదేవితో వెళ్లి, ఆమె వెనుక నిల్చుంది. అపురూప సౌందర్యవతి అయిన మహశ్వరిని, రాజు చూసి, కామవాంఛా పరవశుడై వివాహం చేసుకుంటానని, కాదంటే బలవంతంగా తీసుకువెళతానని ప్రకటిస్తాడు. 714 గోత్రికులు సమావేశమై, ఇట్టి వివాహం వర్ణ సంకరం, వయో వ్యతాస ముచే అనుచితమని నిర్ణయించారు. అయితే రాజుకు నచ్చజెప్పి పంపుతారు. కొద్ది దినాలకు, విష్ణువర్ధనుడు వివా#హ ప్ర యత్నం చేయగా, పరమేశ్వరిని ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెపుతారు. ఇది విన్న రాజు సందేశ#హరులను ఖైదు చేస్తాడు. వారు తప్పించుకుని వినుకొండకు చేర తారు. కులగురువు అయిన భాస్కరాచార్యుడు, 18 పట్టణాల 714 గోత్రికులతో, నగరేశ్వర మండపాన సమావేశపరచి, మ##హశ్వరితోపాటు అగ్నిప్రవేశం చేయ నిర్ణయించారు. కన్యక అభిప్రాయం కోరగా ఆమె, అగ్నిప్రవేశం ద్వారా జ్ఞాన మార్గాన పరమేశ్వ రుని చేరుకుని, కైలాస వాసిని కాగలనని తేల్చి చెప్పిం ది. ఇది విన్న కొంతమంది ప్రాణ భయంతో పారిపో గా 102 గోత్రికులు, కన్యకతో ప్రాణ త్యాగానికి సంసి ద్ధులవుతారు. అగ్నిప్రవేశం సమయాన, వాసవి తన తల్లిదండ్రులు నలకూబర దంపతులని, వీర నారాయణ పురవాసులగు, ధనగుప్త దంపతులు, కైలాస నివాసులు, నందీశ్వర దంపతులని, 102 గోత్రీకులు ప్రమధ గణాలకు చెందినవారని వివ రించింది. శిష్యులంతా, ధర్మమార్గాన్ని వీడ వల దని బోధించింది. అలా అగ్నిలో ప్రవేశించి, ఆత్మార్పణం చేసుకుంది. ఆనాటినుండి వైశ్యు లు భువనేశ్వరిని, ”కన్యకా పరమేశ్వరి” రూపా న పూజించడం సదాచారంగా, సత్‌ సంప్రదా యంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement