Monday, May 20, 2024

అన్నమయ్య కీర్తనలు : సోదించిరిదియే

సోదించిరిదియే సురలును మునులును
ఆదికి అనాది హరినామం || సోదించిరిదియే ||

అరిది వేద శాస్త్రార్థ సంగ్రహము
అరయగ నొకటే హరినామం
దురిత హరము భవ దు:ఖనాశనము
అరి భయంకరము హరినామం || సోదించిరిదియే ||

సకల పుణ్య ఫలసార విహారము
అకలంకము శ్రీహరినామం
ప్రకటము సులభము పరమ పావనము
అకుటిలమిది శ్రీహరినామం || సోదించిరిదియే ||

కందువ సదరము కైవల్యపదము
అందరికిది యే హరినామం
యెందును శ్రీ వేంకటేశ్వరు కరుణకు
అందుకోలేని హరినామం || సోదించిరిదియే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement