Saturday, June 22, 2024

Followup | ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పదంగా మృతి..

కర్నూలు శివారులోని నగరవనం వద్ద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. చెరువులో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు కర్నూలు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు.

మృతులు ముగ్గురు ఎవరు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు, వారు ఎలా మరణించారు? అనేది మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జెండర్లను తీసుకొచ్చి మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement