Tuesday, May 7, 2024

ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..

శ్రీరాంపూర్: బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లినప్పటికీ అపరిచితులకు తమ కార్డులను ఇవ్వకూడదని శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ అన్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద కాపు కాస్తూ అమాయకులను మోసం చేస్తూ వారి కార్డులను మారుస్తున్న మోసగాడిని నస్పూర్‌ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై మంగిలాల్‌, సిబ్బందితో కలిసి నస్పూర్‌కు చెందిన నిందితుడు టి.కె.స్వామి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి
వివరాలను వెల్లడించారు. రామస్వామి అనే వ్యక్తి శ్రీరాంపూర్‌ ఎస్‌బీఐ ఐటీఎంలో డబ్బులు చేసుకునేందుకు ఏటీఎం వద్దకు రాగా టి.కె.స్వామి అతడిని నమ్మించి కార్డును మార్చి తన వద్ద ఉన్న అలాంటి కార్డునే అతనికి తిరిగి ఇచ్చి డబ్బులు రావడం లేదని పంపించాడు. అదే కార్డులో స్వామి రూ.58వేలను మంచిర్యాల, లక్షెట్టిపేట ఇతర ఏటీఎం సెంటర్లలో డ్రా చేశాడు. తాము మోసపోయామని గమనించిన రామస్వామి కుటుంబసభ్యులకు తెలుపగా తమ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న ఎసై#్స మంగిలాల్‌, సిబ్బంది జయచంద్ర, శ్రీను, రవిలను సీఐ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement