Friday, April 26, 2024

PM Tour | భారత్​లో పెట్టుబడులకు టెస్లా సానుకూలం.. ప్రధానితో భేటీలో మస్క్​ వెల్లడి

అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీతో  ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత తాను భారత్‌లో పర్యటించాలనే  కోరికను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తాను భారత్​ రానున్నట్టు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా భారత్​లో స్పేస్​ ఎక్స్​ బ్రాడ్​ బ్యాండ్​ సర్వీస్​ అయిన స్టార్​ లింక్​ని తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానితో ట్విట్టర్​ సీఈవో, టెస్లా, స్పెస్​ కంపెనీల అధినేత ఎలోన్​ మస్క్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నాయకత్వాన్ని మెచ్చుకున్నారు మస్క్. ఇక తాను “మోదీ అభిమాని” అని కూడా చెప్పుకున్నారు. భారతదేశం భవిష్యత్తు గురించి తాను చాలా ఎక్సైటింగ్​గా ఉన్నానని, ప్రపంచంలోని ఏ దేశాని లేని విధంగా ​ అభివృద్ధి చెందడానికి భారత్​కు మాత్రమే చాన్స్​ ఉందని తాను భావిస్తున్నట్టు న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో ప్రధాని మోదీతో మస్క్​ అన్నారు. టెస్లా సీఈఓ పిఎం మోడీతో తన సమావేశాన్ని వివరిస్తూ.. తమ భేటీ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు.

కాగా, ఎలోన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) దిగ్గజం అయిన టెస్లా త్వరలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గతంలో కోరినట్లు కూడా ఈ సందర్భంగా ఎలోన్​ మస్క్​ చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశం గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అనేక విషయాలపై తాను ఎలోన్​మస్క్​తో మాట్లాడానని చెప్పారు. “ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది @elonmusk! శక్తి నుండి ఆధ్యాత్మికత వరకు ఉన్న సమస్యలపై మేము బహుముఖ సంభాషణలు చేసాము” అని ప్రధాని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు.

భారతదేశంలో పెట్టుబడులు

- Advertisement -

కాగా, ప్రధాని మోదీ, ఎలోన్​ మస్క్​ కీలక భేటీలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నలపై ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. “ఆయన (ప్రధానమంత్రి మోడీ) భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే అతను భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది మేము చేయాలనుకుంటున్నాము. ఇప్పుడే ఆలోచిస్తున్నాము. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.

ఇక.. స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని యోచిస్తున్నట్లు కూడా ఎలోన్​ మస్క్​ చెప్పారు. ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది సహాయపడుతుందని మస్క్ చెప్పారు. ప్రధాని మోదీ న్యూయార్క్‌లో అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్ టైసన్, ప్రొఫెసర్ నాసిమ్ నికోలస్ తలేబ్, రచయిత రాబర్ట్ థుర్మాన్, పెట్టుబడిదారు రే డాలియోలను కూడా కలిశారు.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్‌ 21-24 తేదీల మధ్య అమెరికాలో పర్యటిస్తున్నారు. అతను నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సహా వివిధ రంగాలకు చెందిన చాలామందితో భేటీ కానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement