Thursday, May 2, 2024

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నైట్ కర్ఫ్యూపై కీలక నిర్ణయం?

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు  రాష్ట్ర కేబినెట్‌ అత్యవసరంగా భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగనుంది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇప్పటికే స్కూళ్లు, కాలేజ్‌లకు ఇచ్చిన సంక్రాంతి సెలవులు పొడగించారు. వైద్య ఆరోగ్యశాఖ సూచన మేరకు జనవరి 30 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో నేటి కేబినెట్ భేటీ సమావేశంపై ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. వీకెండ్‌లో లాక్‌డౌన్ కూడా విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ నైట్ కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

సినిమా హాళ్లు, ఆఫీసుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రాత్రి 8 గం వరకే మధ్యం షాపులకు అనుమతి లభించనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. వచ్చే రెండు వారాలు కీలకం.. కట్టడి చేయకుంటే కరోనా ఉధృతి కేసుల తీవ్రతను బట్టి మరిన్ని ఆంక్షల పొడిగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement