Friday, February 3, 2023

సుకేశ్ మ‌నీలాండ‌రింగ్ కేసు.. స్టేట్ మెంట్ ఇచ్చిన హీరోయిన్స్

సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ మ‌నీలాండ‌రింగ్ కేసులో ప‌టియాలా కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్..నోరా ఫ‌తేహి. తన కెరీర్ ను నాశనం చేసి జీవనాధారాన్ని పోగొట్టాడని ఆవేదన వ్యక్తంచేసింది జాక్వెలిన్. ఈ మేరకు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పటియాలా కోర్టులో ఆమె స్టేట్ మెంట్ ఇచ్చారు.తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశాడని ఆరోపించారు. సౌత్ ఇండియా సినిమాల్లో కలిసి పనిచేద్దామంటూ సుకేశ్ తనను తప్పుదోవ పట్టించాడని జాక్వెలిన్ కోర్టుకు తెలిపారు. సుకేశ్ నుంచి తను అందుకున్న ఖరీదైన బహుమతుల జాబితాను కోర్టుకు అందజేశారు జాక్వెలిన్.. ఈ జాబితాలో 5 విలువైన గడియారాలు, మసాజ్ చెయిర్, 20 డిజైనర్ నగలు, 47 జతల ఖరీదైన బట్టలు, ఖరీదైన 4 హ్యాండ్ బ్యాగులు, 9 పెయింటింగ్స్ ఉన్నాయి.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీ కూడా ఢిల్లీలోని పాటియాల కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు. సుకేశ్ చంద్రశేఖర్ తనకు ప్రపోజ్ చేశాడని, తన గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇస్తానని చెప్పాడన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement