Wednesday, April 24, 2024

సర్వరోగ నివారణం వైద్యరాఘవుని అర్చనం

త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో… వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు ‘దివ్య తిరుపతులు’, ‘దివ్య దేశములు’ అని పేరు.108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీరరాఘవస్వామి’ పేరుతో శయన రూపంలో నయన మనోహరంగా కొలువుతీరాడు. ఎంతో ప్రాముఖ్య గాంచి పూజలందుకుంటున్నాడు. ప్రాముఖ్యత గాంచింది. ఎన్నో మహిమలు గల దివ్య దేశంగా ప్రసిద్ధి పొందింది. పుష్య బహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య. ఈరోజు ఈ స్వామిని పూజిస్తే సమస్త దీర్ఘ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
ఈనెల 21వ తేదీ శనివారం చొల్లంగి అమావాస్య. ఆ సందర్భంగా ఆ స్వామి దివ్య చరితను స్మరించుకుందాం.

తమిళనాడులోని తిరువళ్ళూరులో వున్న అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని క్రీ.శ 8-9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. చోళ వంశస్తులు ఈ ఆలయాన్ని వివిధ మండపా లను నిర్మింపచేసారు. తర్వాతి కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవస్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరివున్న స్వామివారు ఒక చేయిని కిందికి ముని శిరస్సుపై వుంచి మరో చేయి పైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని వుంటాడు.
కృతయుగంలో బదరికాశ్రమంలో ‘పురుపుణ్యర్‌’ అనే మహర్షి నివసిస్తుం డేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలాకాలం సంతానం కలుగలేదు. దీనితో వారు పుత్ర సంతానం కోరుతూ ఒక సంవత్సర కాలం పుత్రకామేష్టి యాగం చేసారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడిని శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావిం చిన ‘శాలిహోత్రుడు’ అని నామకరణం చేసారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రు డికీ చిన్నతనం నుంచే విష్ణు భక్తి అలవడింది. శాలిహోత్రుడు యుక్తవయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం ‘తిరువళ్ళూరు’ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ‘హృత్తాపనాశని’ తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైనదని గుర్తించాడు. అందులో స్నానం చేసి దైవప్రార్థనలు చేసాడు. ఆ సందర్భంలో అక్కడే వుండి తపస్సు చేయాలనే కోరిక కలగడంతో తప స్సు ప్రారంభించాడు. ఒక సంవత్సరకాలం తపస్సు, యజ్ఞయాగాలు చేసాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలు చేసాడు. ఒక భాగాన్ని దేవునికి సమర్పించాడు. రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు, మూడవ భాగాన్ని తనకోసం వుంచుకుని ఆహుతుడి కోసం ఎదురుచూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడు పంపిన ఆహుతుడుగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధు డిని ఆహ్వానించి ఆహుతుడికోసం వుంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజిం చిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదనడంతో శాలిహోత్రుడు తనకోసం వుంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్లిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దానితో తన తపస్సులో ఏదో లోపం వుండడంవల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహో త్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేసాడు. కానీ ఇంతకుముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమా నికి రాగా ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రు డు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన ”నాకు భుక్తాయాసంగా వుంది. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి?” అని అడగ్గా ”ఇక్కడనే పవళించండి” అన్నా డు. బ్రాహ్మణుడు దక్షిణంవైపు తలపెట్టి, ఉత్తరంవైపు కాళ్లు వుంచి తూర్పువైపు చూస్తూ పవళించాడు. ఈవిధంగా పవళించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షం కావడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరివిధాలుగా స్వామిని ప్రార్థించాడు. శాలిహోత్రుని కోరిక మేర తాను విశ్రాంతికి పవళించిన శయన రూపంలోనే ‘శ్రీ వీర రాఘవస్వామి’గా కొలువుతీరినట్టు స్థల పురాణ కథనం.శ్రీ వీరరాఘవ స్వామికి ఉప్పు, మిరియాలు అంటే ప్రీతి. ఈ స్వామిని దర్శించి ఉప్పు, మిరియాలు సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు, ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతా యని, చేపట్టిన పనులు విజయవంతమవుతాయని విశ్వసిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామి చొల్లంగి అమావాస్య రోజు దర్శనం చేసుకు న్నా, పూజించినా ఎంతో విశిష్ట ఫలితాలు లభిస్తాయి. పుత్రసంతానం లేనివారు ఈ రోజు వరిపిండి, బెల్లం, యాలకులపొడితో చలివిడి చేసి, ఆ చలివిడి మధ్యలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగించి, ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక స్థోమత ను బట్టి మరికొంతమంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. దీపం వెలిగించిన వత్తిని చలివిడి లేక పాలు లేక నీళ్ళతే మింగినట్లయితే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం. పిల్లలు లేనివారికి ఇచ్చినా పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపు చలవ అంటారు. అయితే తిరువళ్ళూరు’ వెళ్ళలేనివారు చొల్లంగి అమావాస్య రోజున ఇంట్లోనే వీరరాఘవస్వామి పటం పెట్టుకుని సంకల్పం చెప్పుకొని పైవిధంగా పూజించాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిని తిరువళ్ళూరులోని పుష్కరిణిగా భావించి మూడు ప్రదక్షిణలు చేయాలి. అనారోగ్యంతో బాధపడేవారు వెండికడియం స్వామి ముందు పెట్టి చేతికి వేసుకోవాలి. ఈ స్వామిని ‘వీరరాఘవుడవు’, ‘వైద్య రాఘ వుడు’ అని అంటారు. ఈ స్వామి ఔషధుల మూటని తలక్రింద పెట్టుకుని పడుకుం టాడని, అనారోగ్యంతో బాధపడే వారు ఆయనను కొలిస్తే వారి బాధలు తొలగి పోతాయని అంటారు.

  • డా|| చదలవాడ హరిబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement