Sunday, May 26, 2024

మెక్సికోలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

మెక్సికోలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ దీప‌క్ బాక్స‌ర్ ని ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎఫ్‌బీఐ స‌హ‌కారంతో ఢిల్లీ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న దీప‌క్ ప‌రారీలో ఉన్నాడు. అయితే త్వ‌ర‌లో అత‌న్ని ఇండియాకు తీసుకురానున్నారు. దేశంలో ఉన్న టాప్ టెన్ గ్యాంగ్‌స్ట‌ర్ల లో దీప‌క్ ఒక‌డు. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బీఐతో పాటు ఇంట‌ర్‌పోల్ స‌హాయంతో మెక్సికో వ‌ద్ద అత‌న్ని అరెస్టు చేశారు. ఢిల్లీ సివిల్ లైన్స్ బిల్డర్ అమిత్ గుప్తా మ‌ర్డ‌ర్ కేసులో బాక్స‌ర్ దీప‌క్ కోసం పోలీసులు చాన్నాళ్లుగా అన్వేషిస్తున్నారు. రోహిణి కోర్టులో జితేంద్ర గోగి ని మ‌ర్డర్ చేసిన త‌ర్వాత దీప‌క్ బాక్స‌ర్ స్థానిక గోగి గ్యాంగ్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. 2023 జ‌న‌వ‌రిలో అత‌ను మెక్సికోకు ప‌రారీ అయ్యాడు. ర‌వి అంటిల్ అనే న‌కిలీ పేరుతో పాస్‌పోర్ట‌ను త‌యారు చేసి కోల్‌క‌తా నుంచి అత‌ను పారిపోయాడు.నేడు పోలీసుల‌కి చిక్కాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement