Sunday, June 2, 2024

Janhvi, Kiara : త‌మిళ మూవీలో జాన్వీ, కియారా

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పటి వరకు అక్కడ హిట్‌ ను సొంతం చేసుకోలేక పోయింది. హిట్‌ పడకున్నా కూడా జాన్వీ కపూర్‌ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్‌ లో జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్‌ కి జోడీగా దేవర సినిమాలో నటిస్తూ మరో వైపు రామ్‌ చరణ్ కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తుంది.

- Advertisement -

మరో వైపు రామ్‌ చరణ్ కి జోడీగా గేమ్‌ చేంజర్ లో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. ఇందటి క్రేజ్‌ ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే కచ్చితంగా చాలా పెద్ద విషయం. త్వరలోనే ఈ అరుదైన కలయిక ఏర్పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరో శింబు త్వరలో నటించబోతున్న సినిమాలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు.

కమల్‌ హాసన్ నిర్మాణంలో దేశింగు పెరియాస్వామి దర్శకత్వంలో శింబు హీరోగా ఈ సినిమా రూపొందబోతుంది. తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శింబు డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. శింబు రెండు పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయనకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలీవుడ్‌ నుంచి తీసుకు రావడం వల్ల పాన్‌ ఇండియా అప్పీల్‌ యాడ్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా బిగ్‌ సర్‌ప్రైజింగ్‌ అప్డేట్ అనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement