Wednesday, June 12, 2024

IPL FINAL | టైటిల్ కోసం ఆఖ‌రి పోరు.. టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌

ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. చెన్నై వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో ఈ ఆఖరి పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఐపీఎల్‌లో రెండో ట్రోఫీ కోసం హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ, మరోవైపు మూడో ట్రోఫీ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ తాడోపేడో తేల్చుకునేందుకు మరికొద్ది సేపట్లో బరిలోకి దిగనున్నాయి.

జట్ల వివరాలు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, పాట్ కమిన్స్ (c), జయదేవ్ ఉనద్కత్.

కోల్‌కతా నైట్ రైడర్స్ :

రహ్మానుల్లా గుర్బాజ్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.

Advertisement

తాజా వార్తలు

Advertisement