Saturday, June 1, 2024

TG | పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి తప్పిపోయాయి. తక్కువ వేగంతో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు పడిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు.

దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. శబరి ఎక్స్​ప్రెస్​ను మిర్యాలగూడ వద్ద, జన్మభూమి ఎక్స్​ప్రెస్​ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement