Monday, October 21, 2024

TGPSC | ఈ నెల 13న గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రైమరీ ‘కీ’

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 9న నిర్వహించిన టీజీ పీఎస్సీ… తాజాగా ప్రైమరీ కీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని 13 నుంచి 17వ తేదీ వరకు టీజీ పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ ప్రైమరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా లాగిన్ అయి కీని ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చు. ఈమెయిల్ ద్వారా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement