Sunday, May 5, 2024

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్2 సింగ‌ర్ కి..హీరో నాని ఆఫ‌ర్

నేచురల్ స్టార్ నాని ఆహాలో ప్ర‌సార‌మ‌వుతున్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షోకి ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. దసరా మూవీతో బ్లాక్‌ బ్లసర్ అందుకున్న నాని తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 వేదిక మీద ఈ వారం స్పెషల్‌ గెస్ట్‌గా మెరవనున్నారు.దసరా సినిమాతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్‌ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్స్ సీజన్‌కే హైలెట్‌గా నిలవనుంది. టాప్‌ 10 కంటెస్టంట్లు ఈ ఎపిసోడ్స్‌లో మధురగాయకుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎప్పీ చరణ్‌ కూడా ముఖ్య అతిథిగాపాల్గొననున్నారు.హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్‌ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. 16 ఏళ్ల కుర్రాడికి నాని సినిమాలో పనిచేసే అవకాశం రావడం విశేషం. ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement