Thursday, May 2, 2024

గుండుతో విజ‌య‌సాయిరెడ్డి – వైర‌ల్ గా ఫొటోస్

కొత్త లుక్ లో మెరిశారు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంటులో ఆ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి .. గుండు చేయించుకున్న త‌ర్వాత స‌రికొత్త లుక్కులో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇలా గుండు చేయించుకున్న లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టిదాకా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. కార‌ణం ఏమిటో తెలియ‌దు గానీ.. త‌ల వెంట్రుక‌ల‌ను పూర్తిగా తొల‌గించుకున్న విజ‌య‌సాయిరెడ్డి ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. వైసీపీకి చెందిన మ‌రో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో విజ‌య‌సాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీకి చెందిన ప‌లు అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య‌సాయిరెడ్డే ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement