Friday, April 26, 2024

దూసుకుపోతోన్న ‘ఝుండ్’ టీజ‌ర్ – అమితాబ్ న‌ట‌న అద్భుతం

ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో న‌టించారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్. మాద‌క ద్ర‌వ్యాల‌కు అల‌వాటు ప‌డి బానిస‌లుగా మారిన వీధి బాల‌లను మామూలు మ‌నుషులుగా మార్చి ..వారితోనే ఫుట్ బాల్ జ‌ట్టుని త‌యారు చేస్తారు అమితాబ్. కాగా ఈ చిత్రం ఫుట్ బాల్ ఆట‌గాడు విజ‌య్ బార్సే జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ చేసి ఓపెనింగ్స్ ని పట్టేస్తున్నారు దర్శక,నిర్మాతలు. తమ సినిమాలో కంటెంట్ ని హైలెట్ చేస్తూ రిలీజ్ చేసే టీజర్,ట్రైలర్స్ కు ఓ రేంజిలో ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియా వచ్చాక బాగున్న టీజర్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా వైరల్ అవుతున్న టీజర్ అమితాబ్ నటించిన ఝుండ్ . ఈ చిత్ర టీజర్ ఇలా విడుదలైందో లేదో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యి దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా చిత్ర టీమ్ ‘ఝుండ్‌’ టీజర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మరాఠి చిత్రం ‘సైరాట్‌’ దర్శకుడు నాగరాజ్‌ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.‘సైరాట్‌’తో జాతీయ పురస్కారం సాధించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులే, అమితాబ్‌ ‘ఝుండ్‌’ పై అభిమానుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. టీజర్ ను షేర్ చేస్తూ అమితాబ్ ఏమన్నారంటే.. మేరీ టీమ్ తయార్ హై ఔర్ ఆప్? ఆ రహే హై హమ్ #Jhund చిత్రం 4 మార్చి 2022న మీ దగ్గరలోని సినిమాహాళ్లలో విడుదల కాబోతోంది టీజర్ నౌ!! అని తెలిపారు. T-సిరీస్ – తాండవ్ ఫిలింస్ బ్యానర్లపై భూషణ్ కుమార్- కృష్ణన్ కుమార్ -రాజ్ హిరేమత్- సవితా హిరేమత్- నాగరాజ్ మంజులే -మీను అరోరా నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement