Sunday, April 28, 2024

తెలంగాణ ప్రజానీకానికి మోడీ భేషరతుగా క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే గండ్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ రాజ్యసభలో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు రేగొండ మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టి మోడీ దిష్టి బొమ్మ దహ‌నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… పార్లమెంట్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించేలా ఉన్నాయని కావున తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోడీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిపారన్నారు. కేంద్రం ముందు విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల తర్వాత 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కు అప్పనంగా అప్పగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగొండ,గోరి కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు, అంకం రాజేందర్, మటిక సంతోష్, ఎంపీపీ పున్నమ్ లక్ష్మిరవి, జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, భూపాలపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి వెంకట రాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరి బాబూ, టౌన్ పార్టీ అధ్యక్షులు కటకం జనార్ధన్, టిబిజికెఎస్ నాయకులు,వెంకట్ రావు, కొక్కుల తిరుపతి, సమ్మయ్య, రాగొత్తం రెడ్డి,సమ్మి రెడ్డి, తదితరులు, కౌన్సిలర్స్ అనిల్, రవీందర్, జిల్లా మైనార్టీ అద్యక్షులు, కరీం, మైనార్టీ సోదరులు, కోటంచ గుడి చైర్మన్ మహేందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలేపకా బిక్ష పతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఉమేష్ గౌడ్,బుర్ర రమేష్, సాంబమూర్తి, పాపిరెడ్డి, తదితరులు, యూత్ నాయకులు ప్రశాంత్ రావు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement