Friday, April 26, 2024

బైక్ పై 179 చ‌లానాలు .. బైక్ వ‌దిలి ప‌రార‌యిన వాహ‌న‌దారుడు ..క‌ట్టాల్సింది ఎంతో తెలుసా ..

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌రాల‌లో ప‌లు చోట్ల జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మయ్యారు. దాంతో త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేశారు. కాగా హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అలీ కేఫ్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా AP23M9895 వాహనాన్ని పట్టుకుని చెక్ చేశారు. ఆ బైక్‌పై ఉన్న చలానాలు చూసి పోలీసులే షాక్ అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది. దానిపై 179 చలానాలు 42,475/- రూపాయలు ఉండడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు. అతని వాహనాన్ని పట్టుకుని బైక్ కి సంబంధించిన వ్య‌క్తిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బండి వదిలి పరారయ్యాడు వాహనదారుడు. భారీ చలాన్ ఉండడంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement