Friday, March 29, 2024

బీమా గ్యారంటీతో ఆదాయం పక్కా.. బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ నుంచి అష్యూర్డ్‌ వెల్త్‌ గోల్‌ స్కీమ్‌

న్యూఢిల్లీ : ఆదాయం, జీవిత బీమాకు భరోసా కల్పించే ప్లాన్‌ బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ అష్యూర్డ్‌ వెల్త్‌ గోల్‌ను ఆవిష్కరించినట్టు బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ సోమవారం ప్రకటించింది. కస్టమర్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ గ్యారంటీతో సేవింగ్‌ కోసం ఈ స్కీమ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. కస్టమర్లకు ఈ స్కీమ్‌ రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ అష్యూర్డ్‌ వెల్త్‌ గోల్‌లో ఒక వ్యక్తి లక్ష్యాలకు రక్షణ కల్పిస్తూనే ఆదాయానికి గ్యారంటీ ఇచ్చేందుకు ఈ స్కీమ్‌ను రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో వ్యయాలు పెరిగిపోయాయి. కాబట్టి ఒక వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో గ్యారంటీడ్‌ ప్రొడక్ట్‌ను కలిగివుండడం ఎంతో ముఖ్యమని బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో, ఎండీ తరుణ్‌ చుగ్‌ సూచించారు. 30 ఏళ్ల వరకు పన్ను చెల్లింపు అవసరంలేకుండా బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ అష్యూర్డ్‌ వెల్త్‌ గోల్‌ను రూపొందించినట్టు వివరించారు. బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 2021 వరకు గ్రాస్‌ రిటెన్‌ ప్రీమియంలో 34 శాతం, రెన్యూవల్‌ ప్రీమియంలో 23 శాతం వృద్ధి సాధించినట్టు వివరించారు. 2020-21లో మొత్తం డెత్‌ క్లెయిమ్‌లకు రూ.1374 కోట్లు చెల్లించగా.. కంపెనీ వ్యక్తిగత క్లెయిమ్‌ సెటిల్మెంట్ల నిష్పత్తి 98.48 శాతంగా ఉందని కంపెనీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement