Saturday, May 28, 2022

కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి.. బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కస్తూర్బాలో చదువుతున్న నందిని అనే 7వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, కస్తూర్బా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతిచెందిందంటూ విద్యార్థిని మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పారు. దీంతో నిరసన విరమించి మృతురాలి బంధువులు వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే.. విద్యార్థిని మృతిపై కస్తూర్బా ప్రిన్సిపాల్ కరుణశ్రీని వివరణ ఇచ్చారు. నందిని అనే విద్యార్థిని గతేడాది కస్తూర్బాలో చేరిందని తెలిపారు. అయితే, అప్పటినుండే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement