Saturday, May 25, 2024

5జీ ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గించేందుకు నిర్ణ‌యం తీసుకున్న.. ట్రాయ్

5జీ ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గించేందుకు త్వ‌ర‌లో కొన్ని సూచ‌న‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపింది టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ పీ.డీ వాఘేలా ఓ ప్రకటన చేశారు. అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు, డిజిటలీకరణలో అందరికీ భాగస్వామ్యం తదితర అంశాలపై ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే.. వీటి ధరలు అందరికీ అందుబాటులో లేకపోవడం ఓ ప్రధాన సమస్యగా ట్రాయ్ భావిస్తోంది. ప్రస్తుతం 5జీ ఫోన్ల సగటు ధర రూ.30 వేలు. రూ. 20 వేల లోపు ధరలకే ఇవి అందుబాటులో వస్తే దేశంలో డిజిటలీకరణ విస్తరించేందుకు, అక్షరాస్యత పెరిగేందుకు దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2జీ, 3జీ ధరలు ఇప్పటికే బాగా తగ్గాయి. 4జీ ఫోన్ల ధరలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే..5జీ ఫోన్ల ధరలు మాత్రం అధికంగా ఉన్నాయి. ఈ ఫోన్ల లభ్యత కూడా తక్కువగా ఉండటం మనముందున్న మరో సమస్య. వీటి పరిష్కారం కోసం త్వరలో ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement