Thursday, May 30, 2024

AP: ఏసీబీ వలలో రావులపాలెం సీఐ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. ఏసీబీ వలలో టౌన్ సీఐ ఆంజనేయులు రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్ర‌కారం… గత నెలలో దొరికిన కోడి పందాల నిందితుడు లక్ష్మణ రాజు వద్ద నుండి రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఏసీబీ అధికారులను లక్ష్మణ్ రాజు ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శనివారం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజమండ్రి ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement